Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్, గోపీచంద్ తో బాలయ్య అన్ స్టాపబుల్-2 ఎపిసోడ్ మామూలుగా లేదు... ప్రోమో ఇదిగో!

Balakrishna Unstoppable 2 latest promo out now
Advertisement
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • తాజా ఎపిసోడ్ కు అతిథులుగా ప్రభాస్, గోపీచంద్
  • టాక్ షోలో నవ్వుల జడివాన
  • లేటెస్ట్ ప్రోమో విడుదల చేసిన ఆహా
Advertisement
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న సెన్సేషనల్ టాక్ షో... అన్ స్టాపబుల్-2. ఈ కార్యక్రమం తాజా ఎపిసోడ్ కు టాలీవుడ్ కథానాయకులు ప్రభాస్, గోపీచంద్ విచ్చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రోమోను ఆహా యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబరు 30న ఆహా ఓటీటీ యాప్ లో ప్రసారం కానుంది. 

ఇక ప్రోమో చూస్తే... బాలకృష్ణ ఎప్పట్లానే తనదైన శైలిలో నవ్వుల జడివాన కురిపించారు. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో కామెడీ బాగా వర్కౌటైంది. అరే, ఒరే అనుకుంటూ ఇద్దరూ తమ ఫ్రెండ్షిప్ ను ప్రదర్శించడం ఆకట్టుకుంది. అంతేకాదు, షో మధ్యలో రామ్ చరణ్ ఫోన్ చేసి ప్రభాస్ సీక్రెట్ ఒకటి బయటపెట్టగా... 'రేయ్ చరణూ... నువ్వు నా ఫ్రెండువా, శత్రువువా!' అంటూ చిరు కోపం ప్రదర్శించారు. 

బాలయ్య పెళ్లి మాటెత్తగానే... సల్మాన్ ఖాన్ తర్వాత చేసుకుంటానని ప్రభాస్ చమత్కరించారు. టాక్ షో ఆద్యంతం ఇలాంటి చమక్కులతో ఆడియన్స్ కు వినోదాల పండుగలా ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
Advertisement
Advertisement
Balakrishna
Unstoppable-2
Prabhas
Gopichand
Promo
Aha
Tollywood

More Telugu News